కొందరు హీరోయిన్లు తమ అందం తో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి హీరోయిన్లు తక్కువ సినిమాలు చేసినా కూడా వాళ్ళు జనాలకు గుర్తుండి పోతారు. అందులో తెలుగు హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా ఒకరు. ఈ అమ్మడు తెలుగు, తమిళ సినిమా లలో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన జత కట్టిన మీరా తర్వాత పెళ్ళి చేసుకొని సినిమాలకు దూరంగా వెళ్ళింది అని సినీ వర్గాలు అంటూన్నాయి.అమాయకత్వంతో నిండిన పాత్రలు చేయాలంటే అప్పట్లో మీరా జాస్మిన్ అందరికి కనిపిస్తుంది.


అమాయికమైన తన చూపులు.. అందమైన ఆకృతి అందరినీ ఆకర్షించింది. అమాయికంగా కనిపించే ఈ అమ్మడు చాలా మంది మనసును తన వైపు లాక్కుంది.. 2000 నుంచి 2010 వరకూ ఈమె వరుస సినిమాలను చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్, రవి తేజ, రాజ శేఖర్, శ్రీకాంత్ లాంటి స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది.మలయాళం భాషల్లో నటించిన జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. ఈ హీరోయిన అసలు పేరు జాస్మిన్‌ మేరి జోసెఫ్‌. మీరా బ్రదర్ జార్జ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.


ఈ ముద్దుగుమ్మ డిగ్రీ చదివే రోజుల్లోనే ఓ చిత్ర దర్శకుడు పిలిచి సినిమాలో నటించె అవకాశాన్ని ఇచ్చాడు.. దాంతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.పాదమ్ ఒన్ను ఒరు విలాపం' మూవీ మీరా జాస్మిన్ కు ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డును తెచ్చిపెట్టింది. ఎన్నో ప్రముఖ పాత్రలలొ నటించి మహిళా అభిమానుల మనసును దొచుకుంది. దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని చిత్ర పరిశ్రమకు దూరమైంది. కొన్ని మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్న కూడా సినిమాలకు దురంగానె వుంది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. అందుకోసం వర్క్ అవుట్స్ చేసి వెయిట్ లాస్ అయింది. మరి ఎ దర్శకుడు సినిమా తో రీ ఎంట్రీ ఇస్తుందొ చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: