టాలీవుడ్ స్టార్స్ లైనప్ సంగతి చెప్పాలంటే ప్రభాస్ లెక్కను ముందు తేల్చాల్సిందే. రెబల్ స్టార్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత లైనప్ స్పీడ్ పెంచేశారు. కోవిడ్ టైంలోనూ వెంటవెంటనే షూటింగ్ లో పాల్గొంటూ హల్ చల్ చేశారు. ప్రాజెక్ట్స్ ను బట్టి 100 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న డార్లింగ్ చేతిలో ఇప్పుడు గట్టిగానే సినిమాలున్నాయి. 2018 లోనే స్టార్ట్ అయిన రాధేశ్యామ్ ను పూర్తి చేసి రిలీజ్ కష్టాలు ఫేస్ చేస్తున్నారు ప్రభాస్. ఆది పురుష్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆగస్టులో రిలీజ్ అంటున్నారు. సలార్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ప్రాజెక్టు కే కోసం క్లియర్ చేయాల్సింది చాలా ఉంది. ఆపై సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప్రాజెక్టు ను లాంచ్ చేయాల్సి ఉంది గ్లోబల్ స్టార్. సెట్స్ పై ఉన్న సినిమాలు, సెట్స్ పైకి వెళ్లబోతున్న సినిమాలే కాదు,మైత్రి బ్యానర్ లో ఒక సినిమా, దిల్ రాజు బ్యానర్ లో మరొక సినిమాతో పాటు డి.వి.వి.దానయ్యకు డార్లింగ్ కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ఆనంద్ తో ఓ మూవీ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి