తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టుని షేర్ చేస్తూ.. నేను సినిమాలకు గుడ్ బై చెప్పేసానట, ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకోబోతున్నానట, అంతేకాకుండా నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను కూడా తాను పెంచుతున్నానట! ఇంకా ఏమైనా యాడ్ చేయాలా లేకపోతే ఈరోజుకి ఈ కల్పిత కథల కోట పూర్తి అయ్యిందా అంటూ ఎద్దేవ చేస్తూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది త్రిష. ఈ పోస్టు ద్వారా రెండు విషయాల పైన క్లారిటీ ఇచ్చింది.ఒకటి ఆమె సినిమాలను వదిలేయడం లేదని రెండు పెళ్లి పిల్లలు అని వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది.
తన వ్యక్తిగత జీవితం పైన మీడియాలో వస్తున్న రూమర్స్ కి సైతం ఇలా కౌంటర్ వేసింది త్రిష. ఈ విషయాలపై అభిమానులు కూడా త్రిష కు మద్దతు పలుకుతూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. త్రిష సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర సినిమా అలాగే హీరో సూర్యతో కరుప్పు వంటి చిత్రాలతో బిజీగా ఉంది. సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటూ తన పని తాను చేసుకుంటుంది త్రిష. అలాగే అప్పుడప్పుడు ఇలాంటి రూమర్స్ కు సైతం కౌంటర్ వేస్తూ వదిలేస్తోంది. తన ప్రైవసీను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఎవరూ కూడా హద్దులు దాటి మాట్లాడితే ఇలాంటి ఒంటరి పరోక్షంగా వేయవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి