టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు అరడజనుకు సినిమాలే పైనే ఉన్నాయని చెప్పవచ్చు. ఆయన హీరో గా నటించిన రాధేశ్యామ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే తాను నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సర్వం సిద్ధం చేశాడు ప్రభాస్. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ముఖ్యంగా తన అభిమానులను ఎంతగానో అలరించబోతున్నాడు.

గత మూడు సంవత్సరాలుగా ప్రభాస్ నటించిన సినిమాలేవీ కూడా వెండితెరపై చూడలేని కారణంగా ఆయన అభిమానులు ఎంతగా నో నిరాశపడ్డారు. వారి ఆకలి తీరుస్తూ ఇప్పుడు ఇంత తక్కువ వ్యవధిలోనే ఈ రెండు సినిమాలను విడుదల చేస్తుండటం విశేషం. ఇక ఆయన బాలీవుడ్ లో చేస్తున్న ఆది పురు ష్ చిత్రం దాదాపుగా పూర్తయ్యే స్థితికి వచ్చిందని తెలుస్తుంది. తొందర్లోనే ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుని ఆగస్టులో విడుదల చేయాలి అన్నది ఈ చిత్ర బృందం యొక్క ఆలోచన.

అలా ఈ మూడు సినిమాలను విడుదల చేసిన తర్వాత ఆయన చేయబోతున్న నాగ అశ్విన్ సినిమా మరియు స్పిరిట్ సినిమాలు తేదీ ప్రకారం కాకుండా కొంత ఆలస్యంగా షూటింగ్ కు వెల్లే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది. ఓ బాలీవుడ్ దర్శకుడితో పాటు మారుతి చెప్పిన కథ కూడా బాగా ఉండడం తో ఈ రెండు సినిమాల కంటే ముందే మారుతి సినిమా చేయాలని ప్రభాస్ నిర్ణయించుకోగా ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న సినిమా ల లైనప్ లో మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఆయన అభిమానులను భారీ స్థాయిలో అలరిస్తున్నారు అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: