టాలీవుడ్ సినిమా పరిశ్రమకు జనవరి నెల కూడా ఏమాత్రం కలిసిరాకుండా పోయింది. ఈ కొత్త సంవత్సరంలో సినిమా పరిశ్రమను కాపాడే చిత్రం జనవరిలో రాబోతుందని అందరూ ఊహించగా అనూహ్యంగా జనవరిలో వచే పెద్ద సినిమాలు రాలేదు. అలా కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెపించలేదు. మొదటగా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు చిత్రం తో పాటు కొంతమంది కొత్త హీరోలు నటించిన సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ హీరోలు కూడా ప్రేక్షకులని అలరించలేకపోవడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమాల విడుదలకు ముందు భారీ స్థాయిలో వీటికి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద హీరోయిన్ లను పెట్టి తమ సినిమాలలో నటింప చేసిన కూడా వారి అందచందాలు ఈ చిత్రానికి ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. దాంతో పేలవంగా ఈ సంక్రాంతి సీజన్ ముగియగా ఇప్పుడు గత వారం వచ్చిన సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెపించకపోవడం తో ఒక్కసారిగా ఎంతో నిరాశాజనకంగా ఈ జనవరి నెల ముగుస్తుంది అని చెప్పొచ్చు. దాంతో ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి నెలలో వచ్చే సినిమాలపై పడింది.

ఫిబ్రవరి నెలలో ముందుగా విశాల్ తన సామాన్యుడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఆ తర్వాత రవితేజ నటించిన కిలాడి సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలు ఏవిధంగా ప్రేక్షకులను అలరిస్తాయి అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రవితేజ నటించిన కిలాడి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అని ప్రేక్షకులు చెబుతున్న నేపథ్యంలో ఈ చిత్రం యొక్క అప్డేట్లు కూడా వారిని ఎంతగానో అలరించిన నేపథ్యంలో ఈ సినిమా వారిని ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. అంతేకాదు ఈ చిత్రం తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ ఫిబ్రవరి నెల అయినా ప్రేక్షకుల ఆకలిని తీరుస్తాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: