ఇకపోతే గత కొంత కాలం నుంచి దీపికా పదుకొనే సోషల్ మీడియాలో ప్రతి చర్చలోనూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవల యువ హీరో సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి గేహ్రియిన్ సినిమాలో నటించింది దీపికా పదుకొనే. అయితే ఈ సినిమాలో మితిమీరిన రొమాన్స్ సీన్లు ఉండటం గమనార్హం. సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉన్నాయి. సీనియర్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే పెళ్లయిన తర్వాత అది కూడా ఒక యువ హీరోతో ఇలాంటి సన్నివేశాల్లో నటించడం ఏంటి అంటూ ఎంతో మంది తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇలా చేయడానికి ముందు భర్త పర్మిషన్ తీసుకుని చేస్తున్నావా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలపై ఇటీవలే అగ్గిమీద గుగ్గిలంలా ఫైర్ అయ్యింది దీపికా పదుకొనే. ఈ విషయంపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు దాని గురించి స్పందించడం కూడా మూర్ఖత్వమే.. అసలు నేను కామెంట్స్ కూడా చదవను.. నా భర్త కూడా కామెంట్స్ చదవడు ఇంత తెలివి తక్కువగా ఎలా మాట్లాడుతారో అని అనిపిస్తూ ఉంటుంది. గేహ్రియిన్ సినిమా చూసిన తర్వాత రన్వీర్ కూడా గర్వంగా ఫీల్ అవుతాడు. తన నటనకి మంత్రముగ్ధుడూ అవుతాడు అన్న నమ్మకం ఉంది అంటూదీపిక పదుకొనే బదులిచ్చింది. కాగా గేహ్రియిన్ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి