యువ హీరో శర్వానంద్‌కి ఆడియన్స్‌లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. యూనిక్‌ స్టోరీస్‌ చేస్తాడని ఒపీనియన్‌ ఉంది. కానీ మూడేళ్లుగా ఈ అంచనాలని నిలబెట్టుకోలేకపోతున్నాడు శర్వా. 'పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం' ఇలా వరుస ఫ్లాపులతో శర్వా మార్కెట్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'తో వైబ్రెంట్ హిట్ కొట్టాడు. యూత్‌లో సెపరేట్‌ ఫాలోయింగ్ వచ్చింది. అయితే 'ట్యాక్సీవాలా' తర్వాత విజయ్‌ మార్కెట్‌లో తేడాలొచ్చాయి. 'డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' డిజాస్టర్స్‌తో విజయ్‌ స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి. మరో హిట్‌ కొట్టి మార్కెట్‌ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్‌తో  'లైగర్' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందుతోంది.

'ఆర్.ఎక్స్.100'తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు కార్తికేయ. అయితే ఈ సినిమా తర్వాత కార్తికేయకి మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్‌ రాలేదు. 'హిప్పీ, గుణ 369, 90 ఎమ్.ఎల్., చావుకబురు చల్లగా, రాజా విక్రమార్క' ఇలా వరుస ఫ్లాపులతో కార్తికేయ గ్రాఫ్‌ పడిపోయింది. కంపల్సరీగా హిట్‌కొడితేనే మార్కెట్‌ని కాపాడుకునే స్టేజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం కార్తికేయ తమిళ ఫిల్మ్‌ 'వలీమై'తో జనాల ముందుకొస్తున్నాడు. ఈ మూవీలో విలన్‌గా చేశాడు కార్తికేయ

విశ్వక్ సేన్‌ 'ఫలక్‌నుమా దాస్' టైమ్‌లో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. పబ్లిక్‌ మీటింగ్స్‌లో బోల్డ్‌గా మాట్లాడి మరో విజయ్‌ దేవరకొండలా కనిపించాడు. అయితే విశ్వక్‌ సేన్‌ స్పీచ్‌లని మ్యాచ్‌ చేసే హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. 'పాగల్' బాక్సాఫీస్‌ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చేస్తున్నాడు. మంచు మనోజ్‌ కొన్నాళ్లుగా బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేయలేకపోతున్నాడు. ఆరేళ్లుగా సరైన సక్సెస్‌ లేదు. 'శౌర్య, ఎటాక్, గుంటూరోడు' ఫ్లాపులతో మనోజ్ కొంచెం స్లో అయ్యాడు. మంచు విష్ణు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 'ఈడోరకం ఆడోరకం' తర్వాత విష్ణుకి వరుస ఫ్లాపులొచ్చాయి. ఈ స్లంపు నుంచి బయటపడ్డానికి శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ అండ్ ఢీ-డబుల్ డోస్' అనే సినిమా చేస్తున్నాడు విష్ణు. మెగా ప్రొడ్యూసర్‌ వారసుడిగా వచ్చిన అల్లు శిరీష్‌ జర్నీ కూడా ఫ్లాపులతోనే నడుస్తోంది.  'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత శిరీష్‌కి సరైన హిట్ లేదు. 'ఒక్క క్షణం, ఏబిసిడి' లాంటి ఫ్లాపులతో శిరీష్‌ స్లంపులో పడిపోయాడు. సందీప్ కిషన్ కూడా సరైన హిట్‌ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తర్వాత ఆ రేంజ్‌ సక్సెస్‌ చూడలేకపోతున్నాడు సందీప్.



మరింత సమాచారం తెలుసుకోండి: