టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది మీరా జాస్మిన్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అప్పటి అగ్రహీరోల సరసన వరుస సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. భద్ర , గుడుంబా శంకర్ , పందెం కోడి చిత్రాలు మీరాజాస్మిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. అలాంటి సమయంలో సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయింది ఈమె. ఎందుకంటే కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి కనుమరుగయింది.

అయితే చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండి పోయిన ఈ బ్యూటీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట.అంతేకాకుండా పలు హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు మళ్ళించుకుంటోంది.  అయితే ప్రస్తుతం  ఈ భామకు బాలయ్య సరసన నటించే ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక అనిల్ రావిపూడి - బాలయ్య కలయికలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా మీరా జాస్మిన్ ను అనుకుంటున్నారట. అయితే మీరా జాస్మిన్ ఒకప్పుడు మాంచి క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం ఈమె  ఫిజిక్ పాడై తెరవెనక్కు వెళ్లిపోయింది.

కానీ ఇప్పుడు మళ్లీ కొత్తగా కనిపిస్తోంది. కాబట్టి ఆమె పేరు కూడా పరిశీలనలోకి తీసుకున్నారని సమాచారం..ఇక  మరోవైపు బాలయ్యతో గతంలో 'మహారధి' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది మీరాజాస్మిన్. ఆ సినిమాలో మరో హీరోయిన్ గా స్నేహ కూడా నటించింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్య సరసన మీరాజాస్మిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇ ఈ అమ్మడికి బాలయ్య ఓకే చెబుతాడో లేదో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: