ఈచిత్రాన్ని తెలుగు , తమిళంలో ఒకేసారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక వీరితో పాటుగా వరమ్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తున్నది. హీరో విజయ్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు గా సమాచారం ఈ చిత్రాన్ని.. అంగరంగ వైభవంగా నిన్నటి రోజున చెన్నైలో ప్రారంభించారు. ఇక నిన్నటి రోజు నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలైనట్లుగా తెలుస్తున్నది. బీస్ట్ సినిమా తరువాత విజయ్ నటిస్తున్న చిత్రం ఇదేనని చెప్పవచ్చు. అంతేకాకుండా విజయ్ ది 66 వ సినిమా కావడం గమనార్హం.
ఇక ఈ సినిమా ద్విభాషా చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. చెన్నైలో ఈచిత్రం కార్యక్రమాలు జరగడంతో ఇందులో రష్మిక ప్రత్యేక ఆకర్షనీయంగా నిలిచింది. ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమాలు అయిపోగానే హీరో విజయ్, రష్మిక మందన పై నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టడం జరిగింది. ఇక వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలతో మంచి ఫామ్లో ఉన్నారు సింగర్ తమన్. థమన్ కూడా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి మొత్తం కథ , స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అంతా వంశీ పైడిపల్లి నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి