దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  దర్శకుడు ప్రశాంత్ నీల్ , యష్ హీరో గా తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ తో  దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ చాప్టర్ 2  సినిమా ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కు సిద్ధంగా ఉంది,  ఈ సందర్భంగా తెలుగు వెర్షన్  కి సంబంధించి హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడారు. ఈ మూవీ ని  ఇక్కడి వాళ్లంతా ఒక తెలుగు మూవీ గానే భావిస్తున్నందుకు ఆనందంగా ఉంది,   పాన్ ఇండియా దిశగా సౌత్ మూవీ లు వెళ్లేదారి ఒకప్పుడు చాలా చిన్నదిగా ఉండేది,  అలాంటి దారిని రాజమౌళి గారు ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చారు అని ప్రశాంత్ నీల్ అన్నారు.

అందువలన ఈ రోజున పాన్ ఇండియా మూవీ చాలా తక్కువ సమయం లోనే కోట్లాది మంది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది,  అందు వలన నేను మాత్రమే కాదు .. పాన్ ఇండియా సినిమా తీసేవాళ్లంతా రాజమౌళి గారి పేరును ముందుగా చెప్పవలసిందే అని ప్రశాంత్ నీల్ తెలియజేశారు, అలాగే నాలాంటి వారెందరికో ఆయన స్ఫూర్తి,  సౌత్ మూవీ స్థాయిని పెంచిన ఆయనకి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను అని అంటూ ప్రశాంత్ నీల్ ముగించారు. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్  'కే జి ఎఫ్ చాప్టర్ 2'   సినిమా సెట్స్ పై ఉండగానే ప్రభాస్ హీరోగా సలార్ మూవీ ని ప్రారంభించాడు,  సలార్ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ,  జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: