టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా ఎక్కడా తగ్గకుండా వసూళ్లతో దూసుకుపోతుంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న (12న ) పేక్షకుల ముందుకు వచ్చింది.ఇక మొదటి షో నుంచి ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి మంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ పోకిరి తరువాత మాంచి మాస్ యాక్టింగ్ తో అదరగొట్టారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తర్వాత ఆ అంచనాలను సర్కారు వారి పాట సినిమా రీచ్ అయ్యిందనే చెప్పాలి. సర్కారు వారి పాట సినిమాని చూసేందుకు కేవలం అభిమానులే కాకుండా.. సామన్య ప్రేక్షకులు కూడా సినిమాకి బ్రహ్మరథం పట్టారు. విడుదలైన ఒక్కరోజులోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ చేస్తోంది. అలాగే ఈ సినిమా ఇండియన్ మార్కెట్‏లోనే కాకుండా.. ఓవర్సీస్‏లో కూడా మంచి వావ్ అనిపించే వసూళ్లను రాబట్టింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 75 కోట్ల గ్రాస్ వసూళ్లు కోళ్లగొట్టినట్టు సినిమా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.



ఇక తాజాగా ఈ సినిమా నుంచి రాప్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. "సర్కారు వారి వేట.. పవర్ ఫుల్ మాట.. రివర్స్ లేని బాట.. " అంటూ సాగే పవర్ ఫుల్ పాటను రిలీజ్ చేశారు సినిమా యూనిట్ వారు. ఇక ఈ పాట సినిమాలో చిన్న బిట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ పాట ఫుల్ సాంగ్ రావడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మహా ఈ రాప్ సాంగ్ రాయగా ఇంకా మహా , శ్రావణ భార్గవి ఇద్దరు కలిసి కలిసి ఆలపించారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాని ఉర్రుతలూగిస్తుంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించి ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్ కు.. డైలాగ్ డెలివరీకి ఇంకా అలాగే నటనకు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. పోకిరి సినిమా తర్వాత మహేష్ మాస్ పాత్రలో నటించడంతో అభిమానులు బాగా హ్యాపీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: