కోలీవుడ్ స్టార్ హీరో అయిన శింబు అంటే తెలియని వారుండరు. తెలుగు తమిళ్ రెండు భాషల లోనూ హీరోగా మారి అడపా దడపా సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా మన్మధ, వల్లభ సినిమాలతో తెలుగులో అశేష ప్రజాదరణ పొందారు అని చెప్పాలి. ఇక ఎక్కువగా నయనతారతో లవ్ వలన బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఆయన తండ్రి టి రాజేందర్ ఒక దర్శకుడిగా టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులు అందరికీ బాగా సుపరిచితులే. కాగా ఈరోజు ఆయన అస్వస్థకు గురై హాస్పిటల్ పాలయినట్లు తెలియడంతో అభిమానులు కంగారు పడుతున్న నేపథ్యంలో శింబు తండ్రి ఆరోగ్యం పట్ల స్పందించారు. దాంతో అభిమానులు కాస్త  కుదుట పడ్డారు.  మా ఇద్దరి అభిమానుల అందరికీ నమస్కారం. నాన్నకు స్వల్పంగా ఛాతీ నొప్పి రావడం తో వెంటనే గుర్తించి హాస్పిటల్ కు తీసుకెళ్ళాము. 

నాన్నను పరిశీలించిన డాక్టర్లు వెంటనే స్పందించి పరీక్షలు చేయగా పొత్తి కడుపులో రక్తస్రావం జరుగుతోందని  వైద్యులు తెలిపారు అని అన్నారు శింబు. కాగా మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం నాన్న ను విదేశాలకు తీసుకెళుతున్నాం, ఆయన పూర్తి స్పృహతో ఉన్నారు, మాట్లాడుతున్నారు అని మీడియాకు వివరించారు హీరో శింబు. ఇది విన్న అభిమానులకు కాస్త ఊరట లభించింది.  దయచేసి ఎవరు కంగారు పడకండి మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. త్వరలోనే చికిత్స ముగించుకుని నాన్న పూర్తి ఆరోగ్యంగా తిరిగి మన ముందుకు వస్తారు.

తర్వాత మళ్లీ మిమ్మల్నందరిని కలవడానికి వస్తారని శింబు ప్రకటించారు.  ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు అంతా దేవుడికి ప్రార్దనలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సైతం పరామర్శిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని హెల్త్ బాలేకపోతే చెత్త చెత్త వార్తలు అంతా ప్రచారం చేస్తున్నారు. ఏదైనా వార్తను రాసే ముందు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని రాయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: