మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ కు అయితే భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. తళతళలాడే అందాలు ఆరబోస్తూ ఈమె 17 ఏళ్ళు గా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఆమె చక్రం తిప్పుతుంది


అయితే సడెన్ గా ఈమె మగరాయుడు లా దర్శనమిచ్చి అందరికీ కూడా షాకిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తమన్నా ఎందుకు? ఎప్పుడు? ఇలా కనిపించాల్సి వచ్చింది… అనే ప్రశ్నలు ఇప్పుడు ఊపందుకున్నాయట.విషయంలోకి వెళ్తే.. ఆ లుక్ 'ఎఫ్3' మూవీకి సంబంధించిందట.


'ఎఫ్2' కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా హారిక అనే పాత్రలో వెంకటేష్ కు జోడీగా నటించింది. 'ఎఫ్2' కంటే కూడా 'ఎఫ్3' లో తమన్నా పాత్ర కి స్కోప్ ఎక్కువ అనే చెప్పవచ్చు.. అంతేకాదు సెకండ్ హాఫ్ కోసం ఈమె మగాడి గెటప్ లో కనిపించాల్సి వచ్చిందట. అది ఎందుకు అన్న విషయాన్ని రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి.. ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే 'ఎఫ్3' లో మగాడి గెటప్ లో కి మారిన తర్వాత తమన్నా..మరో హీరోయిన్ అయిన సోనాల్ చౌహాన్ తో రొమాన్స్ కూడా చేయాల్సి వస్తుంది. అది కూడా కథలో భాగంగానే. ఆమెతో తమన్నాకి ఓ పాట కూడా ఉంటుంద ట..ఆ ట్రాక్ కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉన్నా శృతి మించలేదనీ తెలుస్తుంది.. అయితే తమన్నా 'మగరాయుడు' గెటప్ గురించి చిత్ర బృందం రిలీజ్ కు ముందు వరకు ఎక్కడా కూడా రివీల్ చేయలేదు.


ఇంకో విషయం ఏంటి అంటే తమన్నా కి 'ఎఫ్3' టీంకి మధ్య చిన్న గొడవ అయినట్టు కూడా వినికిడి. ప్రమోషన్స్ లో కూడా ఆమె ఎక్కువగా కూడా కనిపించింది లేదు. అందుకు కారణం.. తమన్నా 'మగరాయుడు' గెటప్ వల్లనే నా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: