రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంత సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ చలనచిత్ర పరిశ్రమ మొత్తం టాలీవుడ్ వైపు చూసి గర్వపడేలా చేసింది బాహుబలి సినిమా. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన బాహుబలి అటు నిర్మాతలు అందరికీ లాభాల పంట పండించింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ఈ సినిమాకు ఎంతో కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా కట్టప్ప పాత్ర ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర పెళ్లికి దూరంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటుంది. ఇక బాహుబలి వంశానికి కట్టు బానిస గా ఉంటుంది.  అయితే ఇక బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమాకు ఎన్నో మార్పుస్పూఫ్ లు చేసి ప్రేక్షకులను నవ్వించారు కమెడియన్స్ చాలామంది. అయితే ఇక ఇటీవల జబర్దస్త్ లో మాత్రం వినూత్నమైన కాన్సెప్టుతో బాహుబలి సినిమాను స్పూఫ్ చేశారు అనే చెప్పాలి. బాహుబలి సినిమాలో కట్టప్ప కు పెళ్లి కాలేదు ఒకవేళ పెళ్లి జరిగితే బాహుబలి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.


 ఈ క్రమంలోనే కట్టప్ప పాత్రలో ఇమాన్యుల్ చేయగా పైమ ను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత కట్టప్ప రాజ్యం కోసం పోరాడటం కాదు కట్టప్ప భార్య పాత్రధారి బాహుబలి భల్లాలదేవుడు రాజమాత శివగామి తో ఒక ఆట ఆడుకుంటాడు. ఇదే విషయాన్ని కామెడీ పంచ్ లతో స్కిట్ రూపంలో చూపించారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీం. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసి అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: