ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్‌ను కూడా పుట్టించేశారు. రవికృష్ణ నవ్యస్వామి మధ్య ప్రేమ, పెళ్లి వ్యవహారాలు జరుగుతున్నాయంటూ లెక్కలేనన్ని కథనాలు వస్తుంటాయి. అయితే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతోన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చేవి..అవి కాస్త వాళ్ళ పాపులారిటీని పెంచాయి.తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెబుతుంటారు. కానీ స్క్రీన్ మీద మాత్రం హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతోంటారు.ఇక నవ్యస్వామి ప్రస్తుతం ఢీ షోలో రవికృష్ణతో కలిసి కామెడీ చేస్తోంది.
అయితే వీకెండ్ వస్తే మాత్రం నవ్యస్వామి తన ఫ్ఱెండ్స్ గ్యాంగ్‌తో కలిసి అల్లరి చేస్తుంటుంది. హరితేజ, కస్తూరీ ఫేమ్ ఐశ్వర్య, నవ్యస్వామి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. కస్తూరీ సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య, నవ్యస్వామిలు ఇద్దరూ రిలేటివ్స్ కూడా..తాజాగా వీకెండ్ పార్టీని ఈ ముగ్గురూ బాగానే సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక నవ్యస్వామి మాత్రం బ్లాక్ డ్రెస్సులో హాట్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక నవ్యస్వామి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం ఇలా రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే.. ఆ ఫోటోలను ఒకసారి చూసెయ్యండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి