ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లోని 15 వ చిత్రాన్ని కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కు సుకుమార్ కథను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజు ముంబై నుండి వచ్చిన ఓ యంగ్ ఇంజినీర్ పాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పై ఇక్కడ క్షుద్రపూజలు జరుగుతాయట. దీంతో అసలు తనపై క్షుద్రపూజలు ఎవరు జరిపించారు? అనే కోణం లో ఈ సినిమా కథ ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇప్పటివరకు తేజ్ ఎప్పుడూ కనిపించని విధంగా ఈసినిమా లో కనిపించనున్నాడు. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తం గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.. మరి ఈ సినిమా అన్నా తేజ్ ను హిట్ టాక్ ను అందిస్తుందేమో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి