ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు హాలీవుడ్ స్టార్ ల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు.  నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ ఉండగా హాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి మరింత గుర్తింపు రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేయబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయిన ఎన్టీఆర్ తమ తదుపరి సినిమా ని కూడా ఆ స్థాయిలో తెరకెక్కించాలన్న డిమాండ్ ఇప్పుడు వారికి ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలోని సినిమాను ఎంతో స్పెషల్ గా చేస్తున్నాడు. తన కెరీర్ లో 30వ సినిమాను చేస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ మే 20వ తేదీన అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నామన్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

డైలాగ్ టీజర్ ని కూడా ఐదు భాషలలో విడుదల చేసి ఎన్టీఆర్ ప్లానింగ్ అంటే ఏంటో చూపించాడు. ఆ విధంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుంటుందా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో మేకర్స్ ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించడంపై ఆలోచన చేస్తున్నారు.  స్క్రిప్ట్ ను ఆల్మోస్ట్ లాక్ చేసిన కొరటాల శివ జూలై నెల నుంచి ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. మరి యాక్షన్ చిత్రాలను ఎంతో బాగా తెరకెక్కించే కొరటాల శివ ఈ చిత్రంతో ఎన్టీఆర్ కు ఏ స్థాయిలో విజయాన్ని అందచేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: