సౌత్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఎంతటి స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంతకాలంగా నార్త్ సినిమాల కంటే సౌత్ సినిమాలే ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ కన్నడ చిత్రాలు కూడా నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సౌత్ సినిమా యొక్క సత్తను దేశవ్యాప్తంగా చాటి చెబుతున్నాయి. అలాగే మరొక సినిమా పరిశ్రమ అయిన మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా కొన్ని మంచి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

అక్కడ హీరోలుగా ఉన్న మమ్ముట్టి మోహన్ లాల్ వంటి సీనియర్ హీరోలు అలాగే యువ హీరోలు ఫాహాడ్ ఫాసిల్, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ వంటి హీరోలు ప్రేక్షకులను ఎంతగానో అలరించే సినిమాలను చేస్తూ తమ సినిమా పరిశ్రమ యొక్క సత్తా ను దేశవ్యాప్తంగా చాటి చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఈ హీరోలు చేస్తున్న సినిమాలను బట్టి అక్కడ ఏ స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయో చెప్పవచ్చు. 

అయితే ఇప్పుడు ముగ్గురు మల్లు యువ హీరోల మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది. అక్కడ నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశం ఈ ముగ్గురికే ఉందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పలు భాషలలో సైతం వీరు మార్కెట్ తెచ్చుకోవడానికి మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా పుష్ప సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న పాహాద్ ఇప్పుడు మలయాళం లో త్రీ లో ఒక హీరోగా ఉన్నాడు. ఇక ఎప్పటినుంచో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు దుల్కర్ సల్మాన్. పృధ్వీరాజ్ సుకుమారున్ కూడా తన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ నెంబర్ వన్ రేసులో తాను కూడా ఉన్నట్లుగా చాటి చెబుతున్నాడు. మరి వీరి లో ఎవరిని ఆ నంబర్ వన్ స్థానం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. అక్కడ కూడా భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: