
ఇది ఒక వైపు జరుగుతోంది.. అయితే దీని గురించి లీనా మణిమేకలై ఏమీ స్పందించలేదు. కాగా మరో పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సమాధానాన్ని చెప్పకనే చెప్పింది. ఈ పోస్ట్ లో శివుడు మరియు పార్వతి ల వేషంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సిగరెట్ తాగుతున్నారు. అయితే ఒకవైపు మొదటి పోస్టర్ రిలీజ్ చేసినందుకే ఇంత గొడవ జరుగుతూ ఉంటే... మళ్లీ మరొక పోస్ట్ ను చేయడం ఎంతవరకు కరెక్ట్ ? దీని వెనుక లీనా మణిమేకలై ఉద్దేశ్యం ఏమిటి ? అంటూ పలువురు తలలు పీక్కుంటున్నారు. అయితే ఈమె ఉద్దేశ్యం ఇది అయి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
దేవుళ్ళ రూపాలు వేరు వేరైనా... దేవుడి ఒక్కడే మరియు దేవుడి మీద ఉన్న భక్తి, ప్రేమలో మాత్రం తేడాలు ఉండవు. అది హిందువు అయినా, ముస్లిం అయినా లేదా క్రిస్టియన్ అయినా.. వారి వారి దేవుల్లపై భక్తి ఉంటుంది. నిజంగా దేవుని గురించి తెలిసిన వారు ఎవరైనా వేరొక దేవుడిని కించపరచరు లేదా అవమనపరచరు. ఇక్కడ లీనా మణిమేకలై చేసింది కూడా ఒక పాత్ర అని మీరు గుర్తు ఎరగండి. ఒక సినిమా, షార్ట్ ఫిల్మ్ లేదా వెబ్ సీరీస్ ఏదైనా మనము పాత్రలను కల్పించకుంటాము.. అంత మాత్రాన అన్ని విషయాలను మనము ప్రశ్నించలేము. కాబట్టి ఈ విషయం గురించి ఇక వివాదాలు ఆపండి అన్నది చాలా మంది అభిప్రాయం. కాగా లీనా మణిమేకలై పోస్ట్ చేసిన రెండవ పోస్ట్ కు మాత్రం సరైన అర్దం... ఇంకా ఎందరో దేవుళ్ళ లాగా అలకరించుకుని ఇలాంటి పనులు చేశారు... చేస్తున్నారు.... చేస్తూనే ఉంటారు అని సో కాల్డ్ వారికి తెలియచేయడానికి ఇది పెట్టింది అని తెలుస్తోంది. తను ఇది పెట్టడం తప్పే అయినా తన ఉద్దేశ్యం అర్దం చేసుకోవాలి.