ప్రస్తుతం ఇండస్ట్రీలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద సినిమాలు క్రేజీ సినిమాలు విడుదలవుతున్న సమయంలో క్లాష్ అవుతూ ఉండటం అన్నది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.అయితే  ఈ క్రమంలోనే కొందరు హీరోలు నిర్మాతలు క్లాష్ ఎందుకు అంటూ సినిమాల బరిలో నుంచి తప్పుకుంటూ ఉంటారు.ఇక కొంతమంది మాత్రం ప్రకటించిన డేట్ కు విడుదల చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు.ఇక  ఆ సమయంలో ఎంత మంది ఎన్ని రకాలుగా రిలీజ్ డేట్ విషయంలో సలహాలు ఇచ్చినా పెద్దగా పట్టించుకుకోరు. అయితే  ఇక ప్రస్తుతం నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఇదే పంథాని అనుసరిస్తున్నారట.

 ఇదిలావుంటే ఏడాది భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో సినిమా విడుదల తేదీని లాక్ చేశారు.అంతేకాదు ఆ తర్వాత అదే సమయంలో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్, అలాగే రాధేశ్యామ్ సినిమాలు కూడా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకోవడంతో ఈ రెండు సినిమాలతో భీమ్లా నాయక్ సినిమా పోటీపడి చివరికి సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది.అయితే ...ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఆగస్టు 5న భారీ స్థాయిలో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే  ఇక అదే రోజు తెలుగు హీరో అఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా కూడా విడుదల కానుంది.

ఇకపోతే  ఈ మూవీ జూలై 22న విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలవల్ల రిలీజ్ డేట్ ని ఆగస్టు 5 కు మార్చేశారు. కాగా దిల్ రాజు నిర్మించిన థాంక్యూ మూవీ జూలై 22న విడుదల కానున్న నేపథ్యంలో దిల్ రాజు రిక్వెస్ట్ చేయడం వల్లే కార్తికేయ 2 టీమ్ తమ సినిమా రిలీజ్ డేట్ ని జూలై 22 నుంచి ఆగస్టు 5 కు మార్చేసింది. అయితే ఇక  ఈ మూవీకి క్లాష్ కాకూడదని కల్యాణ్ రామ్ సినిమాని దిల్ రాజు పోస్ట్పోన్ చేసుకోమని ఓ ప్రపోజల్ తీసుకొచ్చారట. ఇకపోతే కల్యాణ్ రామ్ మాత్రం ఆ ప్రపోజల్ కు అంగీకరించలేదని తను నటించిన బింబిసార సినిమాని ఆగస్టు 5నే విడుదల చేస్తానని చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే  ఇదే రోజున బింబిసార కార్తికేయ 2 తో పాటు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సీతా రామమ్ కూడా ఈ సినిమాలతో పోటీపడబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: