రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అయితే ఏ విధంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో రవితేజకు వరుసగా మరొక పరాజయం ఎదురైనట్లు అయ్యింది. ఈ సినిమా తో ఎలాగైనా విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడిన సమయం లో రవితేజ ఇంకొక పరాజయాన్ని ఎదుర్కోవడం కలవర పడాల్సిన విషయమే. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన రవితేజ సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆదరించలేకపోతున్నాయి. దాంతో ఈసారైనా విజయం అందుకోవాలని విడుదల చేసిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశ పరిచింది.

కారణం ఏదైనా కూడా రవితేజ కనీసం తన అభిమానులను కూడా ఈ చిత్రం ద్వారా అలరించలేకపోయాడు. మాస్ లో మొదటి నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో ఇప్పటిదాకా తన సినిమాలతో ఎక్కువగా మాస్ ప్రేక్షకులను అలరింప చేశాడు. కానీ గత రెండు సినిమాలు ఏ విధమైన ఏ వర్గానికి చెందిన ప్రేక్షకులనైనా అలరించలేకపోయాడని చెప్పాలి. అయితే ఈ సినిమా వల్ల నష్టాన్ని చవి చూసినా డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే విధంగా రవితేజ ఆలోచనలు చేస్తున్నాడట. మరి వారిని ఎంత మొత్తంలో ఆదుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే గత కొన్ని సినిమాలుగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం అందరూ హీరోలకు అలవాటుగా మారింది. ఆచార్య సినిమా విషయంలో చిరంజీవి అదే పని చేశాడు. ఇప్పుడు రవితేజ కూడా ఆయన బాటలో నడుస్తూ డిస్ట్రిబ్యూటర్లకు సహాయం చేయడం విశేషం. ఇది మంచి విషయమే అయినా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోక పోవడమే మంచిది. మరి ఆయన మరొక సినిమా తో మళ్లీ మంచి విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. త్వరలోనే విడుదలను ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: