కన్నడ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చా సుదీప్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు లో ఈగ , బాహుబలి , సైరా నరసింహారెడ్డి లాంటి మూవీ లలో నటించి కిచ్చ సుదీప్ ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో విక్రాంత్ రోనా అనే భారీ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ లో హీరోగా నటించాడు. 

మూవీ కి అనుప్ బండారి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు ,  హిందీ , మలయాళ ,  తమిళ్ భాషలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించిన ఈ సినిమా సెప్టెంబర్ 2 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటైన జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.

మూవీ జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయిన 24 గంటల సమయం లోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని సాధించినట్లు జీ 5  'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్ లలో  ప్రేక్షకులను ఎంత గానో అలరించి మంచి కలెక్షన్ లను వసూలు చేసిన ఈ మూవీ ప్రస్తుతం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను సాధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: