నాని హీరోగా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో ముందుగా దసరా అనే చిత్రం ప్రేక్షకులను తొందర్లోనే పలకరించబోతుంది. ఓ నూతన దర్శకుడితో కలిసి ఆయన చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుందని నమ్ముతున్నాడు. నాని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తర్వాత కూడా మంచి దర్శకులతో సినిమాలు చేసి భారీ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు. అయితే వారి కోరికకు విరుద్ధంగా నాని ఒక ఫ్లాప్ సినిమా దర్శకుడు తో సినిమా చేయాలనుకోవడం నిజంగా వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా నేపద్యంలో నాని ఈ దర్శకుడు తో సినిమా చేయాలనుకోవడం నిజంగా పెద్ద రిస్కే చేస్తున్నాడు అని చెప్పాలి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో రూపొందిన వి సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను నిరాశపరచిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అది ఇంకా మరిచిపోక ముందే నాని ఈ దర్శకుడు తో సినిమా చేయాలనుకోవడం నిజంగా విడ్డూరం అనే చెప్పాలి. ఏదేమైనా నాని ఇప్పుడు స్టార్ హీరోగా మారిన నేపథ్యంలో పెద్ద దర్శకులతో సినిమా చేస్తే బాగుంటుంది అనేది అభిమానుల కోరిక. మరి ఇకపై ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే సినిమాలు చేస్తే బాగుంటుంది. తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇంతటి స్థాయి హీరోగా ఎదిగిన నాని ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ పెట్టి అందులో ఎన్నో ఆసక్తికరమైన సినిమాలను నిర్మిస్తున్నాడు. అలాంటి సినిమాలను తన కెరియర్లో ఏర్పరచుకోకపోవడం నిజంగా పెద్ద మైనస్ అనే చెప్పాలి. అందరు హీరోలు పాన్ ఇండియా అంటూ ముందుకు పోతుంటే ఈ హీరో మాత్రం ఇంకా తెలుగులో ఒక చిన్న విజయం కోసం ఇబ్బంది పడుతూ ఉండడం ఆశ్చర్యపరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: