తెలుగు సినీ పేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ అప్పట్లో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది


మొదట స్వయంవరం అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లయ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకుంది. లయ నటించినది కొన్ని సినిమాలే అయినా ఇప్పటికి ఆమెను అభిమానించే వారు చాలా మంది అయితే ఉన్నారు.


ఇకపోతే లయ తెలుగులో భద్రం కొడుకో, స్వయంవరం, ప్రేమించు, మనసున్న మారాజు, మనోహరం, నీ ప్రేమకై, హనుమాన్, మిస్సమ్మ ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలు నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది లయ. అయితే కెరిర్ బాగా పిక్స్ లో ఉన్న సమయంలో విదేశాలలో డాక్టర్ గా పనిచేస్తున్న శ్రీ గణేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది లయ. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లయిన తరువాత సినిమాలకు దూరంగా యుఎస్ లో సెటిల్ అయిపోయిందట  .


సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది లయ. తనకు తన కూతురుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది. లయ కూతురి పేరు శ్లోక. కూతురు అచ్చం ఆమె పోలికలతో చూడడానికి ఎంతో అందంగా ముద్దుగా కూడా ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా లయ సోషల్ మీడియా ఖాతాలో డాటర్స్ డే సందర్భంగా తన కూతురిని ఫోటోని షేర్ చేసింది. లయ కూతురు కూడా ఆమెలాగే ఎంతో అందంగా ఉండడంతో అభిమానులు ఆమెను కూడా సినిమాల్లోకి రావాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది లయ కూతురు సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: