తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ లలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఒకటి. ఇప్పటికే ఈ సంస్థ నుండి ఎన్నో మూవీ లు తెరకెక్కి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సాధించాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం కూడా ఈ బ్యానర్ నుండి కొన్ని మూవీ లు తెరకెక్కాయి. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా సాధించాయి.

ఈ సంవత్సరం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భీమ్లా నాయక్ మరియు డీజే టిల్లు మూవీ లను నిర్మించాయి. ఈ రెండు మూవీ లు ఇప్పటికే విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు బెల్లంకొండ గణేష్ హీరోగా వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా స్వాతిముత్యం అనే మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇలా వరుస మూవీ లను నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు నాచురల్ స్టార్ నాని హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. నాని హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు తెరకెక్కించ బోయే మూవీ అనౌన్స్మెంట్ మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని ,  కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం దసరా మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: