పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్‌ సినిమాలో నటిస్తున్నారు..ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది..తాజాగా విడుదలైన ఈ టీజర్‌లో డైరెక్టర్‌ ఓం రౌత్ సృజనాత్మత కారణంగా యావత్‌ చిత్ర బృందం తలలు పట్టుకుంటున్నారు.టీజర్‌లో కనిపించిన భారీ స్పెషల్ ఎఫెక్ట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతోపాటు పలువురు అభిమానులు సైతం ఆదిపురుష్‌పై మండిపడుతున్నారు. రామయణం ఇతివృత్తంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పాత్రలను అపహాస్యం చేస్తూ విజువల్ ఎఫెక్ట్స్‌ జోడించారని, పాత్ర వేషధారణ పట్ల పలువురు హిందుత్వ వాదులు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు.

 

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఎక్కువగా ట్రోల్ చేయబడిన టీజర్‌గా ఆదిపురుష్ నిలిచింది.నిజానికి బాహుబలి మువీ మేకింగ్ సమయంలో ప్రభాస్ మోకాలికి తీవ్రంగా గాయమైంది. ఆదిపురుష్‌లో పలు సన్నివేశాలు మొకాలితో చేయవల్సి వచ్చాయి. అటువంటి కఠినమైన సీన్‌లలో ప్రబాస్‌ నటించకూడదని వైద్యులు సూచించారు. దీంతో చేసేది లేక పోస్ట్ ప్రొడక్షన్ దశలో చిత్ర బృందం కొన్ని జిమ్మిక్కులను ఉపయోగించింది. దీంతో మొదటికే మోసం వచ్చింది. ఇక డైరెక్టర్‌ ఓం రౌత్ బాధ్యత వహించాల్సి వుంటుంది..


కాగా,తాజాగా ఈ చిత్ర బృందం చేసిన పొరబాట్లను సరిదిద్దుకునే పనిలో పడింది. 'ఆదిపురుష్' టీజర్‌ను హైదరాబాద్ వేదికగా 3డీలో ఈ రోజు విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విమర్శలపై మరోసారి స్పందించారు. రామాయణ పాత్రలను ఎక్కడా అవమానపరచకుండా ని తెరకెక్కించామని, చూస్తే మీకే అర్ధం అవుతుందని డైరెక్టర్ ఓంరౌత్ స్పష్టం చేశారు. చిత్రయూనిట్‌ తోపాటు ముఖ్య అతిధిగా విచ్చేసిన దిల్ రాజు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. బాహుబలి-1' మొదటిసారి చూసినప్పుడు కూడా ఇలానే ట్రోల్స్ వచ్చాయి. 'ఆదిపురుష్‌' కూడా అలాంటి నే. 3డీలో విజువల్స్‌ చూస్తే మీకే తెలుస్తుందని దిల్ రాజు అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను నిలిపి వెయ్యమని బలంగా టాక్ వినిపిస్తోంది..మరింత సమాచారం తెలుసుకోండి: