ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు జబర్దస్త్ కామెడీ షో ద్వారా కడుపుబ్బా నవ్వుకున్న ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఇక జబర్దస్త్ అనే షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వస్తుంది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి అనసూయ రష్మీలు ఇక జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేస్తూ తమ అందం అభినయంతో ఆకట్టుకుంటూ ప్రతి తెలుగింటి మనిషిలా మారిపోయారు.



 అయితే మొదట అనసూయ ఈ షోకి యాంకరింగ్ చేయగా.. ఆ తర్వాత రష్మీ యాంకర్ గా వచ్చింది. అయితే ఇటీవల జబర్దస్త్ షో కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  జబర్దస్త్ షో ప్రారంభించిన సమయంలో షో నిర్వాహకులు ముందుగా శ్రీముఖిని ఈ షో చేయడానికి సంప్రదించారట.. కానీ శ్రీముఖి మాత్రం కొన్ని కారణాలవల్ల బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుందట. ఇక శ్రీముఖి రిజెక్ట్ చేసిన ఆఫర్ కాస్త అనసూయ తలుపు తట్టింది. ఇక ఆ తర్వాత అనసూయ కెరియర్ ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు యాంకర్ గా అదరగొడుతూనే మరోవైపు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.


 ఇకపోతే దాదాపు పదేళ్ల నుంచి జబర్దస్త్కు యాంకరింగ్ చేస్తున్న అనసూయ ఇటీవల జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. మరో ఛానల్ లో ప్రత్యక్షమైంది. ఇలాంటి సమయంలోనే జబర్దస్త్ కి కొత్త యాంకర్ ఎవరు వస్తారా అని అందరూ ఎదురు చూసారు. కాగా మరోసారి శ్రీముఖిని జబర్దస్త్ యాంకర్ గా మార్చడానికి నిర్వాహకులు ప్రయత్నాలు చేశారట. కానీ రెండోసారి కూడా శ్రీముఖి జబర్దస్త్ అవకాశం వచ్చిన యాంకరింగ్ చేయలేను అంటూ  చెప్పేసిందట. అయితే జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తే ఈటీవీ కి ఒక బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది.. అందుకే తాను కేవలం ఈటీవీకి మాత్రమే పరిమితం అవ్వాలని కోరుకోవడం లేదంటూ శ్రీముఖి కారణం చేపిందట. అందుకే జబర్దస్త్ ఆఫర్ రిజెక్ట్ చేసిందట శ్రీముఖి.

మరింత సమాచారం తెలుసుకోండి: