విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో అధికారికంగా తెలియజేస్తూ ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు భార్య భర్తలుగా అయ్యారు. ఇరువురి కుటుంబ సభ్యుల, స్నేహితుల మధ్య చాలా అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇందుకు సంబంధించి ఫోటోలను అటు విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా ఫోటోలను అభిమానులతో  పంచుకున్నారు.


అయితే ఈ ఫోటోలలో మాత్రం ఒక్క ఫోటో చూసిన నేటిజన్స్ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆ ఫోటో ఏమిటంటే రష్మిక కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోనే. తాను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు తన వాడు అవుతున్నాడనే సంతోషంతో రష్మిక కన్నీళ్లు పెట్టుకుంది. విజయ్ తన మెడలో తాళి కడుతున్న సమయంలో బాగోద్వేగాన్ని ఆపుకోలేక రష్మిక కన్నీరు పెట్టుకుంది. దీంతో రష్మిక, విజయ్ ని ఎంతగా ప్రేమిస్తోందో అనేదానికి నిదర్శనం అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇన్స్టాగ్రామ్ లో రష్మిక  ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది.

ఇప్పుడు నేను మీకు నా భర్తను పరిచయం చేస్తున్నాను.. అతనే విజయ్ దేవరకొండ. నీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం ప్రతి ఎమోషనల్లో నువ్వు నాతో ఉన్నావు, నీ భార్యగా ఉండేందుకు నేను చాలా ఆత్రుతగా ఉన్నానని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు సాంప్రదాయమైన పద్ధతిలో రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం జరిగింది. ఇదంతా ఇలా ఉండాలి రష్మిక ,విజయ్ దేవరకొండ రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాదులో మార్చి 4వ తేదీన జరగబోతోంది. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. మొత్తానికి అభిమానులు నేటిజన్స్ సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: