500 వందల సినిమాలకు పైగా నటించిన మోహన్ బాబు ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించాడు. 70 సంవత్సరాల వయసుకు దగ్గర పడుతున్నప్పటికీ నటుడుగా ఇంకా చాల పాత్రలను చేయాలి అన్న తపన అతడికి ఉంది. ఆ తపన తోనే కొన్ని సినిమాలను తానే స్వయంగా నిర్మించి తాను నటించినప్పటికీ నేటితరం ప్రేక్షకుల అభిరుచిని పట్టుకోవడంలో మోహన్ బాబు ఫెయిల్ అవుతున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో మోహన్ బాబు కొడుకు మంచి విష్ణు తన తండ్రి కోరుకునే ఒక మంచి పాత్రను చేసే అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాడు. మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో విడుదలై సంచలన విజయం సాధించిన ఆండ్రాయిడ్ కున్జప్పన్ మూవీని తెలుగులో మంచు విష్ణు రీమేక్ చేయబోతున్నాడు. తండ్రి కొడుకుల సాన్నిహిత్యానికి సంబంధించి ఒక సున్నితమైన కథతో తీయబడ్డ ఈమూవీ ఒక రోబో చుట్టూ తిరుగుతుంది.


ఈమూవీ మారుతున్న బంధాలకు నిదర్శనం అంటూ విమర్శకులు ఈమూవీ పై ప్రశంసలు కురిపించారు. ఈమూవీలోని 70 సంవంస్తరాల వయసుగల తండ్రి పాత్రలో మోహన్ బాబు నటిస్తూ ఉంటే అతడి కొడుకు పాత్రలో ఒక యంగ్ హీరో నటించబోతున్నాడు. ఈవిషయాలను వెల్లడిస్తూ విష్ణు మీడియాకు లీకులు ఇస్తున్నప్పుడు మీడియా వర్గాలు విష్ణుని ఉద్దేశించి కొడుకు పాత్రలో విష్ణు ఎందుకు నటించడం లేదు అని అడిగినప్పుడు అతడు ఇచ్చిన సమాధానం చాలామందిని ఆశ్చర్య పరిచింది.


తన తండ్రితో కలిసి నటించడం చాల కష్టం అని అంటూ అలాంటి సాహసం మరొకసారి తాను చేయలేనని అందువల్లే మరొక యంగ్ హీరో ఈమూవీలో నటించబోతున్న విషయాన్ని తెలియచేసాడు. గతంలో మోహన్ బాబు విష్ణు లు కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు విజయవంతం కాలేదు. బహుశా ఆ సెంటిమెంట్ తో విష్ణు మోహన్ బాబుతో ఈమూవీలో కలిసి నటించడం లేదు అనుకోవాలి. ఈమూవీ వచ్చే సంవంత్సరం జనవరి నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: