గత కొంతకాలం నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల హవా బాగానే నడుస్తోంది. బాహుబలి సినిమాతో మన భారతదేశంతో సహా ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని చూడటం మొదలుపెట్టింది.ఇక ఆ తర్వాత "ఆర్ఆర్ఆర్" సినిమా వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ పై ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. నార్త్ ఇండియాలో మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక రీసెంట్ గా మాస్కో ఫిలిం ఫెస్టివల్ వారు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల లిస్టులో "పుష్ప: ది రైజ్" సినిమాని కూడా సెలెక్ట్ చేసి ఆగస్ట్ 30న మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను స్క్రీన్ చేశారు.


ఇక తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్  నెలలో రష్యాలో కూడా విడుదల కావడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రష్యా దేశంలోని కొన్ని ప్రదేశాల్లో "పుష్ప: ది రైజ్" సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్యా దేశానికి పతనమవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి రెండవ భాగంగా విడుదల కాబోతున్న "పుష్ప: ది రూల్" సినిమాపై కూడా ఎన్నో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఇంకా అలాగే అనసూయ భరద్వాజ్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.రష్యాలో ఈ సినిమా విడుదల అవ్వడంతో దీంతో మరోసారి అందరి కళ్ళు పుష్ప సినిమాపై పడ్డాయి. రష్యాలో కూడా ఈ సినిమా జనాలను బాగా మెప్పిస్తుందని బన్నీ ఫ్యాన్స్ చాలా ఆశగా వున్నారు. మరి చూడాలి పుష్ప రష్యాలో ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: