లక్కీ ఛాన్స్ కొట్టేసింది గా ఆర్జివి బ్యూటీ అష్షు రెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన కలను నెరవేర్చకుంది. సిల్వర్ స్క్రీన్ పై అందాల ఆరబోతుకు రెడీ అవుతోందట.

అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ సమంతగా.. ఆమె ఇమేజ్ ఆమెకు ఉంది. బిగ్ బాస్ కు వెళ్లడంతో .. స్మాల్ స్క్రీన్ పై వరుస ఆఫర్లు సాధించింది. స్పెషల్ షోస్ తో దడదడలాడించింది. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసిందట బ్యూటీ.మరో వైపు... వెండితెర ప్రయత్నానలో భాగంగా.. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోయడం కూడా మొదలు పెట్టింది అష్షు రెడ్డి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుని.. సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ అవ్వాలని ప్లార్ చేసింది. ఇక ఎట్టకేలకు అనుకున్నది సాధించింది అష్షు రెడ్డి. హీరోయన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తుంది.

 
యంగ్ హీరో అరవింద్ కృష్ణ రీసెంట్ గా ఓ న్యూ మ్యూవీని స్టార్ట్ చేశాడు. ఏ మాస్టర్ పీస్‌ టైటిల్ తో సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుగు సూపర్ హిరోగా అరవింద్‌ కృష్ణ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడట.. సుకు పూర్వజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అష్షు రెడ్డి సెలక్ట్ యినట్టు కూడా తెలుస్తోంది.ఈ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందట.. బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డి ..ఈ 'సినిమాలో లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోందని తెలిసి ఆమె ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన సస్పెన్స్ ఎలిమెంట్స్‌ తో డిజైన్‌ చేసిన ఏ మాస్టర్ పీస్‌ టైటిల్‌ లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ అయితే పెంచుతోంది.

 
మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆద్య అనే పాత్రలో అషూరెడ్డి కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నదట.యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో అషూరెడ్డి కనిపించబోతున్నట్లు కూడా సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు కూడా సమాచారం. నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహనరంగ సినిమాతో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ మీద మెరిసిందట అష్షు రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: