మెగా ఫ్యామిలీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా మంచి హిట్లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మెగా హీరోగా అడుగుపెట్టిన కూడా వరుణ్ తన సినిమాలతో అభిమానులను దక్కించుకున్నాడు. బాబాయ్ పెదనాన్న అన్నయ్య లాగా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కథలని ఎంపిక చేసుకోకుండా కాస్తా ప్రయోగాత్మక కథలు యాక్షన్ థ్రిల్లర్ స్టోరీస్ ని ఎంపిక చేసుకుంటూ వరుణ్ ముందుకి వెళ్తున్నాడు.వరుణ్ తేజ్ సినిమాలలో డాన్స్ లతో ఉండే డ్యూయెట్లు  పెద్దగా ఉండవు. అయితే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగా ఉండేలా చూసుకుంటారు. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. గాండీవదారి అర్జున అనే టైటిల్ ని ఈ సినిమాకి ఖరారు చేశారు. ఆ పోస్టర్ లో ఒక చేత్తో గన్ పట్టుకొని మరో చేత్తో రౌడీని క్రిందికి నెట్టి పట్టుకున్నాడు.ఈ పోస్టర్ ని చూస్తే ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నది అని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పోలీస్  గా కనిపిస్తున్నట్లు సమాచారం. 
ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది ప్రత్యేకంగా విష్ చేశారు. ఇందులో భాగంగా తన అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరుణ్ తేజ్ కి స్పెషల్ విషెస్ చేశాడు.అందులో చిన్నప్పుడు వరుణ్ తేజ్ ని ఎత్తుకొని రామ్ చరణ్ తీసుకున్న ఫోటోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసి విషెస్ చెప్పారు.ప్రస్తుతం ఈ ఫోటో ట్విట్టర్ లో బాగా వైరల్ గా మారింది. వరుణ్ తేజ్ రామ్ చరణ్ మధ్య ఉన్న రిలేషన్ ని ఈ ఫోటో పెర్ఫెక్ట్ రిప్రజెంట్ చేస్తుంది అంటూ మెగా అభిమానులు అందరూ కామెంట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ పై వరుణ్ తేజ్ కూడా రియాక్ట్ అయ్యి తన అన్నకు థాంక్స్ చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి బర్త్ డే రోజున కొత్త సినిమా పోస్టర్ తో పాటు అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి కాస్తా ఇంటరెస్టింగ్ గా విశేష్ ని వరుణ్ తేజ్ అందుకోవడం అతను మరచిపోలేని అనుభూతి.

మరింత సమాచారం తెలుసుకోండి: