ఇక బాహుబలి 1,2 సినిమాలతో మన తెలుగు సినిమా స్థాయిని నేషనల్ లెవల్ కు తీసుకెళ్ళి దేశమంతా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇప్పటికీ చెక్కు చెదరని ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ గా వుంది.ఇక ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా అయితే ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే కాదు ఏకంగా వరల్డ్ సినిమా దృష్టినే ఆకర్షించే విధంగా హాలీవుడ్ లో ఎన్నో అవార్డులు రివార్డులను అందుకుంటూ మరింత ఎత్తుకు దూసుకు వెళుతుంది.తాజాగా హాలీవుడ్‌లో జరిగిన ఓ మీట్‌లో ప్రపంచంలోనే పెద్ద దర్శకుడు జేమ్స్ కేమరూన్ తో దర్శకధీరుడు రాజమౌళి కలిసి మాట్లాడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా ఎంతగానో ఆకర్షించింది. ఇక వీరు కలుసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. 


ఇక ఇప్పుడు దానికి ఫైనల్ వీడియోని కట్ చేసి మేకర్స్ విడుదల చేశారు. మరి అందులో అవతార్, టైటానిక్ లాంటి వండర్స్ ని సృష్టించిన కేమరూన్ .. రాజమౌళి ఇంకా కీరవాణితో ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి చెప్పడంతో వారిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.ఇంకా అంతేకాకుండా కేమరూన్ భార్య కూడా రాజమౌళితో మా వారు ఈ సినిమాని రెండుసార్లు చూశారని చెప్పడంతో వారు మరింత ఆనందం కావటం ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే చివరలో జేమ్స్ కేమరూన్ రాజమౌళితో చెప్పిన మాట అయితే ఇప్పుడు నిజంగా పెద్ద గ్లోబల్ సెన్సేషన్ గా మారింది. 'ఇక మీరు ఒకవేళ హాలీవుడ్‌లో సినిమా తీయాలి అనుకుంటే ఒకసారి మనం మాట్లాడుకుందాం'..అని రాజమౌళితో అనడంతో ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: