2020 వ సంవత్సరంలో మలయాళంలో రిలీజ్ అయిన 'కప్పెల' సినిమాకు రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన చిత్రం 'బుట్టబొమ్మ'. 'ఎంతవాడు గానీ, విశ్వాసం' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అజిత్ కుమార్తెగా నటించి విశేషమైన పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ అనిక సురేంద్రన్ మొట్టమొదటిసారి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మీద చాలా మంచి బజ్ ఉంది.నేడు రిలీజ్ అయ్యి ఎలాంటి టాక్ తెచ్చుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.కథ పరంగా సినిమా పర్వాలేదు. ఆల్రెడీ బాల నటిగా చిన్నప్పుడే తానేంటో ప్రూవ్ చేసుకున్న అనిక సురేంద్రన్, ఈ సినిమాలో సత్య అనే పల్లెపడుచుగా ఆమె ఒదిగిపోయింది. ఇంకా డబ్బింగ్ మాత్రం కొన్ని సన్నివేశాల్లో సింక్ అవ్వలేదు కానీ, నటిగా ఆమె స్క్రీన్ ప్రెజన్స్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం ప్రేమలో పడిన యువతిగా ఆమె హావభావాలు యూత్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతాయి.


ఇక 'ఖైదీ, మాస్టర్, అంధగారం, విక్రమ్ ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్ దాస్ ఈ సినిమాలో కోపోద్రిక్తుడైన ఆర్కే పాత్రలో తన వాయిస్ ఇంకా నటనతో ఎప్పటిలాగే సూపర్ గా అలరించాడు. తెలుగులో తన క్యారెక్టర్ కు ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం అనేది తన పాత్రకు మంచి వేల్యూని యాడ్ చేసింది. సూర్య వశిష్ట కూడా ఆటోడ్రైవర్ గా బాగా నటించి పర్వాలేదనిపించుకున్నాడు.గోపీసుందర్ సంగీతం సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. పచ్చిపులుసు వంశీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది, అరకు అందాలను కూడా చాలా కొత్త కోణంలో చూపించారు. లిమిటెడ్ స్పేస్ లో కూడా డిఫరెంట్ యాంగిల్స్ తో రిపిటీషన్ లేకుండా చేసిన విధానం చాలా బాగుంది. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది.దర్శకుడు చంద్రశేఖర్ టి.రమేష్ తెలుగు వెర్షన్ కథకు చేసిన మార్పులు వర్క్ ఔట్ అయ్యాయి. ముఖ్యంగా ఓపెనింగ్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన విధానం అలాగే నేటివిటీకి ఆడియన్స్ ను కనెక్ట్ చేయడంలో చాలా బాగా బాగుంది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: