బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ లవ్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న కియారా, సిద్ధార్థ జోడి గురించి ప్రత్యేకంగా ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేదు. ఇదివరకే కియారా కూడా తెలుగు తెరకు పరిచయమై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను బాగా అలరించింది. ఇటీవల శంకర్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది. మరొకవైపు బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా కూడా పలు సినిమాల ద్వారా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా చట్టపట్టలేసుకొని తిరిగిన ఈ జంట ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతోంది.

ప్రస్తుతం కియారా అద్వానీ , సిద్ధార్థ మల్హోత్రాల వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా ఘనంగా జరగబోతోందని అంతేకాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జరిగిన పెళ్లిళ్లలో వీరిది అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలవబోతోంది అని సమాచారం.  రాజస్థాన్లోని జై సల్మేర్లో ఉన్న సూర్యగడ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది. అయితే వీరి పెళ్లి ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో ఘనంగా జరగబోతుందని.. ఒక్కో రోజు ఖర్చు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. మొత్తానికైతే మూడు రోజుల పెళ్లి కోసం రూ. 6 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు వీరి పెళ్లికి హాజరయ్యే వీఐపీలు,  స్టార్ సెలబ్రిటీల కోసం 70 మెర్సిడెస్ , బీఎండబ్ల్యూ లాంటి ఖరీదైన కార్లను ఏర్పాటు చేశారట. ఇన్ని రోజులు ప్రేమ పక్షుల్లా విహరించిన ఈ జంట ఈరోజు మూడు ముళ్ళు అనే బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. తమ జీవితంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది గుర్తు లా ఎప్పటికీ ఉండేలా వీరు ఇలా ప్లాన్ చేశారట. సంగీత్, హల్దీ,  మెహందీ వంటి ఫంక్షన్లను ఘనంగా జరుపుకున్న ఈ జంట ఈరోజు మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతోంది. ఈ జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రేక్షకులు , అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: