తన రికార్డుని తానే బద్దలుకొట్టిన జేమ్స్ కామెరూన్ ?

జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో టైటానిక్ ని వెనక్కి నెట్టి టాప్ 3 ప్లేస్ లోకి ఉంది. టైటానిక్‌($2.217 బిలియన్) పేరిట ఉన్న రికార్డును అవతార్‌-2 సినిమా తాజాగా బ్రేక్‌ చేయడం జరిగింది.మొదటి రెండు స్థానాల్లో అవతార్‌-1 ఇంకా అవేంజర్స్‌ ఎండ్‌గేమ్‌ సినిమాలున్నాయి. మిక్స్డ్‌ టాక్‌తోనే ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు సాధించిందంటే జేమ్స్‌ సత్తా ఏంటో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమా ఇండియాలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అవతార్‌-2 సినిమా ఇండియాలో అత్యధిక కలెక్సన్‌లు సాధించిన హాలీవుడ్‌ సినిమాగా సూపర్ రికార్డు క్రియేట్‌ చేసింది.ఇక ఫుల్‌రన్‌ ముగిసే సరికి ఇండియాలో ఈ సినిమా ఏకంగా రూ.386.90 కోట్ల కలెక్షన్లు సాధించింది.అవతార్‌-2' సినిమా గతేడాది డిసెంబర్‌ నెలలో రిలీజై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. 


కానీ కలెక్షన్‌లలో మాత్రం ఒక రేంజిలో జోరు చూపించింది. జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు నీరాజనాలు పలుకారు. ఇక మొదటి భాగంలో పండోరా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్‌ కామెరూన్‌..ఈ సారి మాత్రం ఏకంగా సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. తన విజువల్స్‌తో మాయ చేశాడు. సినిమా రిలీజై రెండు నెలలు దగ్గరికొస్తున్నా కూడా ఇంకా కొన్ని చోట్ల అవతార్‌ 2 సినిమా హవానే కొనసాగుతుంది. అయితే ఇండియాలో మాత్రం ఈ సినిమాకు ఎండింగ్‌ కార్డు పడినా.. పక్క దేశాలలో మాత్రం ఇంకా దీని జోరు నడుస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా టైటానిక్‌ కలెక్షన్‌లని కూడా దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.దీంతో తన సినిమా రికార్డుని తానే బద్దలు కొట్టుకొని సెన్సేషన్ సృష్టించాడు జేమ్స్ కామెరూన్. ఇక లాంగ్ రన్ లో ఖచ్చితంగా అవేంజర్స్, అవతార్ రికార్డులని కూడా అవతార్ 2 బ్రేక్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: