తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి శివ గురించి ప్రత్యేకంగా తమిళ సింక్ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకున్న శివ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ఈ దర్శకుడు కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా తాప్సి హీరోయిన్ గా రూపొందిన దరువు అనే స్టేట్ తెలుగు మూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శివ కు మంచి గుర్తింపు లభించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివ కోలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరో లలో ఒకరు అయినటు వంటి సూర్య తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరియర్ లో ఈ మూవీ 42 వ మూవీ గా రూపొందుతుంది.

మూవీ లో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మించి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం బృందం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను  విడుదల చేయలేదు. అలాగే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించలేదు.  మరో రెండు వారాల్లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ను మరియు ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: