ప్రస్తుత కాలంలో సినిమాల విషయంలో ఓటీటీల ప్రభావం ఎంతలా ఉందో మనకు తెలిసిందే. చిన్న సినిమా నుండి పెద్ద సినిమాల వరకు ముందుగా ఓటీటీలతో ఒప్పందం కుదుర్చుకున్నకే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లో సినిమాలు ఎంత హడావిడితో రిలీజ్ అయిన ఆడియన్స్ లో వాటికి దక్కుతున్న ఆదరణ బట్టి మేకర్స్ ఆ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందులో కొన్ని సినిమా విడుదలైన రెండు నుంచి మూడు నెలల వరకు ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వవు. కొన్ని సినిమాలు అయితే విడుదలైన మూడు - నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ కి వచ్చేస్తాయి. 

ఈ క్రమంలోనే తాజాగా కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'రంగమార్తాండ' మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తాజాగా థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. గతంలో మరాఠీలో సూపర్ హిట్ గా నిలిచిన నటసామ్రాట్ అనే మూవీకి ఇది అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. ఉగాది కానుకగా మార్చి 22న ఈ సినిమా రిలీజ్ అయి ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం థియేటర్స్ లో ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో రంగమార్తాండ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట మూవీ మేకర్స్. అంతేకాకుండా సినిమాకు పెట్టిన బడ్జెట్లో దాదాపు 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా మూవీ టీం అమెజాన్ తో ఓటిటి డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇక చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా హిట్ తర్వాత కృష్ణవంశీహీరో తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అన్నట్టు ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: