
ఇప్పటి వరకు అనేక అవతారాల్లో సందడి చేసిన బాలకృష్ణ మరొక అవతారంలో కనిపించబోతున్నాడు. రాబోతున్న శుక్రు వారం మార్చి 31న ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలయ్య కామెంటరీతో అదరగొట్టనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించడం అతడి అభిమానులకు జోష్ ను కలిగిస్తోంది. బాలయ్య లైవ్ లో ఎలా మాట్లాడటం అంటే అనేక విచిత్రాలు ఉంటాయి. రకరకాల కొత్త కొత్త పదాలు కూడ బాలయ్య మాట్లాడుతాడు.
ఇది ఇలా ఉంటే మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ నరేంద్రమోడి క్రికెట్ స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రారంభం కాబోతోంది. దాదాపు రెండు నెలలు పాటు జరగబోయే ఈ పోటీలను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో కొన్ని కోట్లమంది చూస్తారు. కొన్ని వందల కోట్ల యాడ్ వ్యాపారం జరిగే ఈపోటీల పై అనేక కార్పోరేట్ కంపెనీలు ఆశక్తి కనపరుస్తాయి.
ఇక మొదటిరోజున ఘనంగా జరిగే ప్రారంభపోటీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానం ఉండబోతోంది. ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగా బాలకృష్ణ ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి లైన్ క్లియర్ చేసాడు అని వస్తున్న వార్తలు మరింత సంచలనంగా మారాయి. ఈ వెబ్ సిరీస్ ను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది అంటున్నారు. ఇప్పటికే రానా వెంకటేష్ లు కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో ఎటువంటి అశ్లీలతా లేకుండా ఉండే వెబ్ సిరీస్ లో నటించి బాలయ్య ఒకకొత్త మార్గానికి లైన్ క్లియర్ చేస్తాడా అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..