
ప్రస్తుతం ఏ ఫంక్షన్ కి వెళ్ళినా.. ఈవెంట్ కి వెళ్లినా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ఎప్పుడు వివాహం చేసుకుంటారు అని అభిమానులు అడుగుతుంటే.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్తాను అంటూ తెలిపింది. ఇప్పుడేమో పెళ్లికి సిద్ధంగా ఉన్నాను అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఒక మంచి కుర్రాడి కోసం ఎదురుచూస్తున్నాను అంటూ కూడా తెలపడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాలి. ఆమె మాట్లాడుతూ.." జీవితంలో పెళ్లి అనేది ఒక బాధ్యత.. దానికి నేను కట్టుబడి ఉంటాను. ముఖ్యంగా వివాహ బంధం బలంగా ఉండడం కోసం ఏం చేయడానికి అయినా నేను సిద్ధమే" అంటూ తెలిపింది.
ఇకపోతే ఈ హనీ రోజ్ పేరు ఇప్పటివరకు ఎలాంటి ఎఫైర్లలో కూడా వినిపించలేదు.. ఒకవేళ రిలేషన్షిప్ దాచినా సరే ఎక్కువకాలం కొనసాగించలేనని కూడా గతంలో తెలిపింది. మరి ఈమెకి కాబోయే వరుడు ఎలా ఉంటాడో తెలియాల్సి ఉంది.