పోయిన సంవత్సరం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా లలో కాంతారా మూవీ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ కన్నడ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసింది. మొదట ఈ మూవీ కన్నడ భాషలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ని ఇతర భాషలలో కూడా విడుదల చేశారు.

అందులో భాగంగా ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు.  రిషబ్ శెట్టి ఈ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. సప్తమి గౌడ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లోని నటనకు గాను రిషబ్ శెట్టి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. ఈ మూవీ కోసం కేవలం నిర్మాతలు 5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

5 కోట్లు పెట్టి నిర్మించిన ఈ సినిమాకు వందల కోట్లలో లాభాలు వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సీక్వల్ గా "కాంతారా 2" ను మొదలు పెట్టబోతున్నారు. ఇది ఇలా ఉంటే కాంతారా 2 కు మాత్రం భారీ బడ్జెట్ ను నిర్మాతలు కేటాయించినట్లు తెలుస్తోంది. కాంతారా 2 కు ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ను నిర్మాతలు ఇప్పటికే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించడానికి నిర్మాతలు ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: