నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దసరా.ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓదెల దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం సింగరేణి నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ నెల 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ నటించిన ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా శరవేగంగా చేస్తోంది చిత్ర బృందం. నాని ఈ చిత్రంలో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు వీర్లపాలెం అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ ఈ సినిమా అంచనాలను పెంచేసాయి. ఇందులో నాని ధరణి పాత్రలో కనిపిస్తూ ఉండగా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతోంది. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లలో అలనాటి తార సిల్క్ స్మిత పోస్టర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ పోస్టర్ దగ్గర ఉన్న అరుగుపైన నాని సీసా పట్టుకొని కూర్చున్నట్లుగా కనిపిస్తోంది అంతేకాకుండా ఒక పాటలో సిల్క్ స్మిత పోస్టర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఈ కథకు సిల్క్ స్మితకు సంబంధం ఏంటి అనే సందేహాలు అభిమానులు కలుగుతున్నాయి.


అయితే ఇందులో నాని సిల్క్ స్మిత అభిమానిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా నాని సిల్క్ స్మిత పోస్టర్లు కనిపించడం వెనుక కారణాన్ని తెలియజేశారు. అంతా అనుకున్నట్లుగా తాను ఈ సినిమాలో సిల్క్ స్మిత ఫ్యాన్ కాదని ఆమెకు తన డైరెక్టర్ శ్రీకాంత్ వీర అభిమాని అని తెలిపారు. అయితే ఈ సినిమాలో ఆమె పోస్టర్ పెట్టడానికి కారణం మాత్రం సస్పెన్షన్ ఉంచారు నాని. మరి అసలు విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: