టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న సత్య దేవ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తర్వాత సినిమాల్లో హీరో పాత్రలను దక్కించుకున్నాడు. అలాగే ప్రస్తుతం సినిమాల్లో హీరో పాత్రలో మాత్రమే కాకుండా విలన్ పాత్రల్లో మరియు ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

అందులో భాగంగా కొంత కాలం క్రితమే చిరంజీవి హీరో గా రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ లో విలన్ పాత్రలో సత్య దేవ్ నటించాడు. ఈ మూవీ లో సత్య నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సత్య "గాడ్సే" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని సి కే స్క్రీన్స్ పై సీ.కళ్యాణ్ నిర్మించాడు. ఈ మూవీ లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. శాండీ అద్దంకిమూవీ కి సంగీతం అందించగా, నాగబాబు , బ్రహ్మాజీ లు కీలక పాత్రల్లో నటించారు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ మంచి అంచనాలను మా థియేటర్ లలో విడుదల అయింది. కాక పోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ మూవీ త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీ లో ప్రసారం కానుంది. మరి ఈ మూవీ కి బుల్లితెర ప్రేక్షకుల నుండి ఎ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: