తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి మంచి విజయాలను కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయినటు వంటి కళ్యాణం కమనీయం అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

యు వి క్రియేషన్ సంస్థ నిర్మించిన ఈ మూవీ లో యువ హీరో సంతోష్ శోభన్ హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ప్రియ కు కూడా మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తమిళ ... తెలుగు సినిమా లలో నటించి ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను ... అలాగే తనకు సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ప్రియ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రియ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కొంటే చూపులతో కవ్వించే విధంగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ కు సంబంధించిన ఈ వెరీ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: