నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపూడి ల కాంబినేషన్ లో మొదలైన మూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. ఈమూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ తన మొదటి పరీక్షలో నెగ్గింది. ఈమూవీని ఎట్టి పరిస్థితులలోను దసరా కు విడుదల చేసి తీరాలని బాలకృష్ణ గట్టి పట్టుదల పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈమూవీ తరువాత ఏమాత్రం గ్యాప్ లేకుండా బాలకృష్ణ మరొక మూవీని లైన్ లో పెట్టే ఉద్దేశ్యంలో కొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఈపరిస్థితుల మధ్య దర్శకుడు బోయపాటి బాలయ్యను కలిసి ఒక పొలిటికల్ స్టోరీ లైన్ ను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్టోరీ లైన్ బాలయ్యకు నచ్చడంతో అ కథను డెవలప్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది.


వాస్తవానికి బాలయ్య బోయపాటిల కాంబినేషన్ లో తీయవలసి ఉన్న ‘అఖండ 2’ గురించి ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి అని అంటున్నారు. అయితే వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంవత్సరం కావడంతో పాటు తిరిగి తెలుగుదేశం బౌన్స్ బ్యాక్ అవుతున్న లేటెస్ట్ రాజకీయ పరిస్థుతులలో ‘అఖండ 2’ కంటే ఒక పొలిటికల్ మూవీ చేయడం తన ఇమేజ్ కి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉపయోగ పడుతుందని బాలయ్య భావించడంతో ప్రస్తుతానికి ‘అఖండ 2’ ఆలోచనలు పక్కకు పెట్టారు అని అంటున్నారు.


‘అన్ ష్టాపబుల్’ సీజన్ 2 ఆశించిన స్థాయిలో సక్సస్ కాకపోవడంతో ఇప్పుడు బాలకృష్ణ ఆలోచనలు అన్ ష్టాపబుల్ సీజన్ 3 పై ఉన్నాయి అని అంటున్నారు. దీనికితోడు ఈ సమ్మర్ ఎండ్ లో ప్రారంభంకాబోయే ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ కు బాలయ్యను హోస్ట్ గా పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ స్టార్ మా లోని కొందరు కీలక వ్యక్తులు ఉన్నప్పటికీ బాలయ్య కంటే ఈ షోకు రానా అన్ని విధాల సరిపోతాడు అన్న సూచనలు కూడ కొందరు చేస్తున్నట్లు టాక్..మరింత సమాచారం తెలుసుకోండి: