‘దసరా’ సూపర్ హిట్ అవ్వడంతో మాస్ హీరోగా మారాలని నాని కన్న కలలు ఎట్టకేలకు నెరవేరాయి. ‘పక్కింటి అబ్బాయి’ ఇమేజ్ నుండి బయటకు నాని సక్సస్ ఫుల్ గా బయటకు రాగలిగాడు. సాధారణంగా టాప్ హీరోలు ఒక ఇమేజ్ లో ఇరుక్కున్నప్పుడు ఆ ఇమేజ్ చట్రం  నుండి బయటకు రావడానికి ఎంతో కష్టపడాలి. అంత కష్టపడినప్పటికీ ఆ కష్టానికి పడిన ఫలితం అందరికీ దక్కదు. అయితే ఈ విషయంలో నానీకి కష్టానికి ఫలితం దక్కింది.



ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోన్ దాటి మాస్ హీరోగా మారాలని ప్రయత్నిస్తూ చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ ‘వి’ ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండా ధైర్యంగా ‘దసరా’ లో నటించి తాను కోరుకున్న విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఈవిషయాన్ని ఉదాహరణగా చూపెడుతూ మాస్ మహారాజా రవితేజా ఇలాంటి సాహసం చేసి తన మాస్ ఇమేజ్ నుండి క్లాస్ ఇమేజ్ తెచ్చుకునే సినిమాలు చేయలేడా అంటూ కొందరు అతడి పై కామెంట్స్ చేస్తున్నారు.



వాస్తవానికి గతంలో రవితేజా ‘సారొచ్చారు’  లాంటి కొన్ని కథా బలం ఉన్న సినిమాలను చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆసినిమాలు అన్నీ మాస్ మహారాజా ను నిరాశను కలిగించాయి. దీనితో ఇక లాభం లేదనుకుని మళ్ళీ తన మాస్ స్టైల్ ను అనుసరిస్తూ నటించిన ‘ధమాక’ బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో మళ్ళీ అతడు ట్రాక్ లోకి వచ్చేసాడు.  ఈవారం విడుదల కాబోతున్న ‘రావణాసుర’ లో కూడ అతడిది నెగిటివ్ పాత్ర.



ఆసినిమా కూడ ఊహించిన విధంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే ఇక అతడు చేసే సినిమాలు అన్నీ ఈ తరహాలోనే ఉంటాయి కాని నాని చేసిన సాహసం మాస్ మహారాజా చేయకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. దీనితో రానున్న రోజులలో రవితేజా నాని లా మారతాడా లేదా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు అతడి అభిమానులలో ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: