శ్రీలీల మ్యానియాలో ప్రస్తుతం టాలీవుడ్ ఉంది. మహేష్ పవన్ విజయ్ దేవరకొండ లతో పాటు సీనియర్ హీరో బాలకృష్ణతో కూడ ఈమె నటిస్తూ ఉండటంతో ప్రస్తుతం ఈమె ప్రతిరోజు షూటింగ్ స్పాట్ లో ఉంటోంది అన్న వార్తలు వస్తున్నాయి. దర్శకుడు చెప్పిన విషయాన్ని వెంటనే అవగాహన చేసుకుని ఎక్కువ టేకులు లేకుండా ఈమె నటిస్తున్న తీరుకు ప్రవర్తనకు చాల మంది ఆమె పట్ల ఆకర్షితులు అవుతున్నారు.



ప్రస్తుతం ఈమె అనీల్ రావిపూడి మూవీలో బాలకృష్ణకు కూతురుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో ఒక మాస్ సాంగ్ ను అనీల్ రావిపూడి చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబాయి నుంచి వచ్చిన డ్యాన్సర్లు లోకల్ జూనియర్ ఆర్టిస్ట్ లు ఇలా వందలాది మందితో ఈ మాస్ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఈపాట చిత్రీకరణ జరుగుతుంది అని తెలుస్తోంది.



ఈ మూవీలోని ఒక ఉత్సవం సందర్భంగా ఈసాంగ్ వస్తుందని ఈ పాటకు ధమన్ ఇచ్చిన మాస్ బీట్ ట్యూన్ ఈమూవీకి హైలెట్ గా మారుతుందని అంటున్నారు. కేవలం ఈపాట చిత్రీకరణ కోసమే 5 కోట్లు ఖర్చు పెడుతున్నారని లీకులు వస్తున్నాయి. లైటింగ్ క్రేన్ ల దగ్గర నుంచి ముంబాయి డ్యాన్సర్లు కావడంతో వారి ఖర్చులతో కలుపుకుని ఇంత భారీ స్థాయిలో ఖర్చు అవుతోందని అంటున్నారు.  


ఈమూవీలో బాలకృష్ణకు కూతురుగా శ్రీలీల నటిస్తోంది అని ఇప్పటికే వార్తలు వస్తున్నప్పటికీ ఆమె పాత్ర స్వభావం ఏమిటి అన్న విషయమై దర్శకుడు అనీల్ రావిపూడి సీక్రెట్ ను కొనసాగిస్తున్నాడు. బాలయ్య పక్కన కాజల్ హీరోయిన్ గా మొట్టమొదటిసారి నటిస్తోంది. ఇప్పటివరకు అనీల్ రావిపూడి తీసిన సినిమాలలో కంటే ఎక్కువ హ్యూమర్ డోసేజ్ తో పాటు ఎమోషన్స్ చాల ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఈ సంవత్సరం దసరాకు రాబోతున్న ఈమూవీతో మరో హిట్ కొట్టాలని బాలయ్య గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: