టాలీవుడ్ లో కోలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది హీరోయిన్ కీర్తి సురేష్.. ఈ మధ్యకాలంలో తరచూ వార్తలలో నిరుస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ఒక అబ్బాయి తో డేటింగ్ లో ఉందని త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు రావడం జరిగింది.ఈ విషయంపై కీర్తి సురేష్ ఎన్నోసార్లు క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. తాజాగా ఒక అబ్బాయి తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేయడంతో ఈ విషయాలకు మరింత బలం చేకూర్చేలా చేసింది.


ముఖ్యంగా ఇద్దరూ కూడా ఒకే కలర్ దుస్తులలో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఈ వార్తలకు పుల్ స్టాప్ పెట్టడం కోసం కీర్తి సురేష్ స్వయంగా స్పందించడం జరిగింది.. సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్న ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది ఫోటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడు అంటూ తెలిపింది.. తన బెస్ట్ ఫ్రెండ్ ను కూడా ఇలా వార్తలలోకి లాగేశారు.. నిజమైన మిస్టరీ మాన్ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మీకు పరిచయం చేస్తాను అంటే తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది కీర్తి సురేష్.


ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన కూడా ఈ వార్తలు మాత్రం అడ్డుకట్టు వేయలేకపోతున్నారు తాజాగా ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి కూడా స్పందించడం జరిగింది..తన కూతురు ఒక అబ్బాయి తో డేటింగ్ లో ఉందని త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో కథలుగా వినిపిస్తున్నాయి. అవన్నీ ఫేక్ న్యూస్ అని తెలిపారు ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ నాకు ఆ అబ్బాయి తెలుసు అతడు మా కుటుంబానికి స్నేహితుడు ఫరహాన్ పుట్టినరోజున కీర్తి సురేష్ కొన్ని ఫోటోలను మాత్రమే పోస్ట్ చేసింది. అసత్య వార్తల వల్ల తమ కుటుంబం మనశాంతి లేకుండా ఉంటోంది అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: