మొదటిసారి ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ అయిన ఓం రౌత్ దర్శకత్వం నటించిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం వచ్చే నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటించగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసుడు పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు పలు రకాల ట్రోల్కు కూడా గురైంది. కానీ ట్రైలర్ విడుదల చేయడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా పాటలు కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు ఈ సినిమా పైన కాన్ఫిడెంట్ కూడా చిత్ర బృందానికి పెరిగిపోయింది.


ఈ క్రమంలోని ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ సాంగును కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను తిరుపతిలో భారీ ఎత్తున చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆది పురుష్ చిత్రానికి సంబంధించి ఒక విషయం ఇండస్ట్రీ వర్గాలలో తెగ వైరల్ గా మారుతోంది. ఈ సినిమాకు సంబంధించి థియేటర్ నాన్ థియేటర్ల్ బడా సంస్థల సైతం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే   రూ.160-170 కోట్ల రూపాయల వరకు జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నైజాం ఏరియాలోని భారీ ధరకు ఈ సినిమా అమ్ముడుపోయినట్టు సమాచారం.


ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ బడ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విడుదలకు ముందే ఇలాంటి రికార్డులను సృష్టించిన ఆది పురుష్ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి. దాదాపుగా రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాతో తెరకెక్కించిన ఈ సినిమా టి సిరీస్ బ్యానర్ పైన నిర్మించడం జరిగింది. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: