ఎవరూ ఊహించని విధంగా రామ్ చరణ్ ‘వి మెగా పిక్చర్స్’ అంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించడమే కాకుండా తన ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించి నిఖిల్ ను హీరోగా చేసి ప్రకటించిన ‘ది ఇండియా హౌస్’ మూవీ ఫస్ట్ లుక్ పోష్టర్ పై వస్తున్న ఊహాగానాలు అనుకోని రాజకీయ రగడకు ఇప్పుడు ఆస్కారం కలిగిస్తోంది.


వాస్తవానికి ఈ మూవీ కథ ఏమిటి అన్నది ఎవరికీ క్లారిటీ లేకపోయినా ఈ మూవీ ఒక రాజకీయ మూవీ అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రముఖ వ్యక్తి వీరసా వర్కర్ జీవితం పై తీస్తున్న బయోపిక్ అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. మహారాష్ట్రాకు చెందిన స్వతంత్ర సమరయోధుడు వీరసా వర్కర్ జీవితం పై ఈసినిమా ఉండబోయే నేపద్యంలో అనేక వివాదాలకు చిరునామాగా కొనసాగిన అతడి జీవితం పై మూవీ అంటే అనుకోని రాజకీయ రగడలో చిక్కుకున్నట్లే అంటూ అప్పుడే కొందరు కామెంట్స్ మొదలు పెట్టారు.  

గత కొంతకాలంగా వీరసా వర్కర్ వ్యక్తితం పై అఖిల్ భారత స్థాయిలో కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలు వ్యక్త పరుస్తోంది. ఈవిషయం పై ఆమధ్య రాజకీయ వివాదాలు కూడ నడిచాయి. అయితే మరికొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతాపార్టీ వీరసా వర్కర్ ను దేశం గర్వించే స్వాతంత్ర సమరయోధుడుగా గుర్తిస్తోంది.

ఇలాంటి రాజకీయ రగడతో కూడుకుని ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి జీవితం పై సినిమా తీయడం సంచలనం అయినప్పటికీ అది అనవసరపు వివాదాలకు తావు ఇస్తుందేమో అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ’ ఏదోవిధంగా చిరంజీవితతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచు కోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి మాత్రం తాను రాజకీయాలకు దూరం అంటూ మౌనంగా ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో భారతీయ జనతాపార్టీ అభిమానిస్తున్న వీరసా వర్కర్ జీవితం పై రామ్ చరణ్ సినిమా తీయడం నిజమేనా లేదంటే ఈ న్యూస్ గాలివార్తలా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: